Gold Rates Today : పండగ వేళ పసిడిప్రియులకు షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి
బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి ధరలు బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా అటువైపు చూడటం లేదు. బంగారం అంటే ఒక రకంగా భయం పట్టుకుంది. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంది. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరువలో ఉంది. అదే సమయంలో కిలో వెండి ధరలు మూడు లక్షలకు దరిదాపుల్లో ఉన్నాయి. ఇంత పోసి బంగారం, ధరలు కొనుగోలు చేయడం అనేది చాలా కష్టమైన విషయం.
అంత సులువు కాదు...
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు అంత సులువు కాదు. ముఖ్యంగా బంగారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టిన ఐదు గ్రాముల బంగారం కూడా చేతికి అందడం లేదు. గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి . అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ఉద్యమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో జరిగే ప్రతి పరిణామం కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే ధరలను పెరిగినా ఇప్పుడు పెద్దగా ఆలోచించడం లేదు. ఎందుకంటే కొనుగోలు చేయాలన్న ఆలోచన లేకపోవడంతో ధరలతో సంబంధం లేదని అంటున్నారు.
ధరలు భారీగా...
పండగలు, పెళ్లిళ్లకు ధరలు మరింత పెరగనున్నాయి. మళ్లీ శుభముహూర్తాలు వస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ రేంజ్ లో గతంలో ఎన్నడూ ధరలు పెరగలేదని వ్యాపారులు అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,750 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,460 రూపాలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,75,000 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరిగే అవకాశముంది.