Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. కరెంట్ తీగలా వెండి

. ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది

Update: 2026-01-13 03:06 GMT

బంగారం ధరల పెరుగుదల ఆగేటట్లు కనిపించడం లేదు. వెండి ధరలు కూడా తగ్గడం లేదు. బంగారం, వెండి ధరల పెరుగుదల గత పదమూడు నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ర్యాలీ ఇక్కడికి ఆగేటట్లు కనిపించడం లేదు. బంగారం ధరలు ఎంత వరకూ వెళతాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అలాగే వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం, వెండి విషయంలో ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరిపోయింది. కిలో వెండి ధర మూడు లక్షలకు దగ్గరగా ఉంది. ఇక ఈ నెల, లేదంటే వచ్చే నెలలో మూడు లక్షల రూపాయలకు వెండి చేరే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

శుభకార్యాల సమయంలో...
బంగారం, వెండి వస్తువుల విషయంలో ఎవరూ వెనక్కు తగ్గరు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండి విషయంలో సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక శుభకార్యాల సమయంలో ధరలు మరింతగా పెరుగుతాయి. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తప్పనిసరిగా బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తుండటంతో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. అందుకే ధరలు ఎంత పెరిగినప్పటికీ బంగారం, వెండి విషయంలో శుభకార్యాల సమయంలో రాజీ పడరు. మరొకవైపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి అంశాలతో బంగారం, వెండి వస్తువుల ధరల్లో మార్పులు జరుగుతాయి.
ఈరోజు ధరలిలా...
ఇక పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం విషయంలో కొంత తగ్గుతున్నారు. వెండిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఆలోచిస్తున్నారు. ధరలు పతనమయితే ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని మదుపు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,42,160 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,87,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News