Gold Price Today : ఈ ఏడాది కూడా బంగారం ధర దిగివచ్చే అవకాశాల్లేవ్.. రీజన్ ఇదే
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. ధరలు తగ్గే అవకాశమే లేదు. ఇది అందరూ చెబుతున్న మాటే. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నప్పటికీ ఇంకా ధరలు తగ్గుతాయేమోనని చాలా మంది వేచి చూస్తున్నారు. కొద్దిగా పెరిగినా.. భారీగా పెరిగినప్పటికీ ధరలు మాత్రం మధ్యతరగతి, వేతనజీవులకు మాత్రం బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉండటం లేదు. గత ఏడాది కూడా బంగారం, వెండి ఇదే ర్యాలీని కొనసాగించింది. ఈ ఏడాది కూడా అదే సీన్ కనిపిస్తుంది. అందుకే బంగారం ధరలు ఇక తగ్గవు. ఫిక్సయిపోండిక.. అన్నట్లుగా కొనుగోలు చేయాలనుకున్న వారు కొనుగోలు చేయవచ్చు. లేకుంటే మానుకోవచ్చు అన్న రేంజ్ లో ధరలు పెరుగుతున్నాయి.
ధరలు తగ్గకపోయినా...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. అదే సమయంలో వెండి తమ ఇంట్లో ఉంటే శుభసూచకమని అందరూ భావిస్తారు. ముఖ్యంగా భారతీయులు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి విషయంలో ధరలు అదుపులోకి రావని అందరికీ అర్థమయినప్పటికీ ఇంకా ఏదో కొంత ఆశలతో ఇంకా ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ధరలు వరసగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ బంగారం, వెండి విషయంలో మాత్రం వెనక్కు తగ్గరు. వెండి ధరలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా ఇంకా ధరలు అందుబాటులోకి రాలేదు. అలాగే బంగారం పది గ్రాములు లక్షన్నరకు చేరువలో ఉంది. కిలో వెండి ధర మూడు లక్షలకు దగ్గరగా ఉంది. అందుకే ధరల విషయంలో ఎలాంటి సందిగ్దత అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి బంగారం ధరలు...
ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతుంది. కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. ధరలు పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. బంగారం అంటే ఇష్టమున్నప్పటికీ వాటి ధరలను చూసి వెనక్కుతగ్గుతున్నారు. ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,39,320 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,67,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.