Gold Rates Today : పసిడి మళ్లీ షాకిచ్చిందిగా.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగానే పెరుగుదల కనిపించింది.

Update: 2025-03-13 03:02 GMT

బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకరోజు తగ్గాయన్న ఆనందం గంటలు కూడా నిలవడం లేదు. ఉదయం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మధ్యాహ్నానికి భారీగా పెరుగుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించేటట్లే కనపడుతుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ ఒక్కరోజు తగ్గిందన్న సంతోషం లేదు. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే 89 వేల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా పదివేల రూపాయలకు దగ్గరగా ఉంది. ఇంత భారీ స్థాయిలో పెరగడం కనీ వినీ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు అందుబాటులో లేక...
బంగారం, వెండి అంటే అందరికీ ఇష్టమే. అలాగని అందుబాటులో ఉంటే తప్ప కొనుగోలు చేయలేరు. భారతదేశంలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి ప్రజలే. వీరు కొనుగోలు చేస్తేనే డిమాండ్ అధికంగా ఉంటుంది. అమ్మకాలు ఊపందుకుంటాయి. కానీ ధరలు పెరగడంతో పేద, మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు బంగారం వైపు చూడటం మానేశారు. వాటి ధరలను వింటేనే భయపడిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నా గతంలో ఎన్నడూ ఈ స్థాయి పెరుగదల లేదన్నది వాస్తవం.
భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ అయినా సరే బంగారం అమ్మకాలు ఊపందుకోకపోవడంతో వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. పేరుకుపోయిన బంగారం నిల్వలు దుకాణాలను వెక్కిరిస్తున్నాయి. ధరలు తగ్గితే తప్ప ప్రజలు బంగారం, వెండి వంటి వాటివైపు చూడరని వ్యాపారులు చెబుతున్నారు. కానీ అవి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగానే పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,660 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,990 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,09,100 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు.


Tags:    

Similar News