Bigg Boss 9: ఎట్టకేలకు పదోవారంలో తనూజ కలనిజమయిందిగా?
బిగ్ బాస్ సీజన్ 9 కెప్టెన్ గా తనూజ పదో వారంలో ఎంపికయింది.
బిగ్ బాస్ సీజన్ 9 కెప్టెన్ గా తనూజ పదో వారంలో ఎంపికయింది. బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ను విజయవంతంగా ముగించిన తనూజ రీతూ చౌదరి, నిఖిల్ ను ఓడించి కిరీటాన్ని తనూజ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ వీక్ లో తనకు కెప్టెన్సీ రావడం ఆనందంగా ుంఉందని తెలిపింది. ఈ వారం ఎలిమినేషన్ నుంచి కూడా తనూజ సేవ్ అయింది. ముందు నుంచి తనూజని అవసరానికే బాండింగ్స్ పెట్టుకుంటుందని, తనూజ భరణిలది ఫేక్ బాండింగ్ అంటూ ట్రోల్ చేశారు. ఇక దివ్య వచ్చాక వారి మధ్య ఇద్దరి మధ్య బాండింగ్ తగ్గిందని అనుకున్నారు. అంతేకాదు ఈ మధ్య భరణి కూడా దివ్యతోనే ఎక్కువ క్లోజ్ ఉంటున్నాడు. రీ ఎంట్రీ తర్వాత దివ్యను నామినేషన్ చేసి భరణి తాను బాండింగ్ లో లేనని చెప్పదలచుకున్నాడు.
కెప్టెన్ కాగానే...
అయితే తనూజ కెప్టెన్ కాగానే భరణి తనకు తనూజపై ఉన్న ఎఫెక్షన్ ను ఆపుకోలేకపోయాడు. తనూజ కెప్టెన్సీ గెలిచిందని తెలిసిన వెంటనే ఆమెను ఎత్తుకుని మరీ తన ఆనందం ప్రకటించాడు. నాన్న అంటూ భరణని ఆప్యాయంగా పలకరించే తనూజకు, కూతురుగా తనూజను చూసే భరణికి మధ్య బాండింగ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఈ ఘటన నిరూపించింది. తనూజ కెప్టెన్సీ గెలవగానే భరణి ఆనందంతో గంతులేశాడు. అదే ఆనందంలో పరుగెత్తుకుంటు వెళ్లి తనూజని ఎత్తుకుని ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. తనూజ ఫొటోను కెప్టెన్సీ గ్యాలరీలోనూ ఉంచిన భరణి తన ఆనందాన్ని ఆమెతో పంచుకున్నాడు. ఎన్ని సార్లు పోరాడి చివరకు సాధించుకున్నావంటూ ప్రశంసించాడు.
తనను ఎత్తుకోకపోవడంపై...
అయితే తనూజ కెప్టెన్ కాగానే భరణి ఉత్సాహాన్ని చూసిన దివ్యకు మాత్రం ఆగ్రహం తెప్పించినట్లుంది. భరణితో వాగ్వాదానికి దిగింది. తాను కెప్టెన్ అయినప్పుడు తనను ఎందుకు ఎత్తుకోలేదని భరణిని దివ్య సూటిగా ప్రశ్నించింది. తనకు చేయి బాగా లేదని, నిన్ను ఎత్తుకునే శక్తి నాకు లేదని నవ్వుతూనే భరణి సమాధానమిచ్చాడు. అయితే తన దగ్గరకు వచ్చే సరికి శక్తి సరిపోదా? అవతల వాళ్ల విషయంలో శక్తి వస్తుందా? అంటూ సెటైర్ వేసింది. కెప్టెన్సీ అయిన వెంటనే నువ్వు బిజీగా ఉన్నావని, అందుకే నేను ఎత్తుకోలేదని భరణి సమాధానం చెప్పబోయాడు. అయితే నేను అంత బరువుగా ఉన్నానా? లేదంటే మీకు సంతోషంగా లేదా? అని కూర్చున్న చోట నుంచి విసవిసా దివ్య లేచిపోయింది. దీంతో మరోసారి భరణి, దివ్యల మధ్య వార్ మొదలయినట్లు కనపడుతుంది.