Bigg Boss 9 : ఇమ్మూ ప్లాన్ అట్టర్ ప్లాప్.. భరణి కెప్టెన్ అయ్యాడుగా

బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది

Update: 2025-12-09 06:11 GMT

బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. అయితే కొత్త టాస్క్ లు ఇచ్చి మిగిలిన ఏడు కంటెస్టెంట్లతో షోను నడిపేందుకు బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం షో చప్పగా సాగుతుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇమ్యూనిటీ కావాలంటే ఇప్పటి నుంచీ పెట్టే టాస్క్ లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పారు. అందులో భాగంగా బాక్సులలో ఉన్న పాయింట్స్ కంటెస్టెంట్ ఎంత వర్త్ అన్నది సూచిస్తుంది. సమయానుసారంగా బాల్ పడుతుంది. దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరికి, ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేది చెప్పాలి. ప్రతీ ఒక్కరికీ కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి.

అమ్మ కోసం ఇమ్మూ ప్లాన్ ఫెయిల్
ఫస్ట్ బాల్ ను పట్టుకున్న డెమోన్ లక్ష రూపాయలను సుమన్ శెట్టికి ఇచ్చాడు. దానికి హౌస్ మేట్స్ అందరూ ఒప్పుకున్నారు. తనూజాకు లక్షలు, ఇమ్మూకి 2.5 లక్షలు, భరణికి 50 వేల పాయింట్స్ వచ్చాయి. రేసులో తాను లేను కాబట్టి ప్రతీ వారం, ప్రతీ టాస్క్ లో బెస్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ కు బాక్సుల్లో ఎక్కువగా ఉన్న 2.5 లక్షలను కల్యాణ్ ఇచ్చాడు. సంజనాకు మాత్రం జీరో పాయింట్స్ వచ్చాయి. నిజానికి చివర్లో సంజన, భరణి మిగిలారు. దానికి ముందుగానే ఇమ్మూ బాల్ అందుకుని సంజనాకు పాయింట్స్ ఇవ్వాలి అనుకున్నాడు. బాల్ అందుకున్న ఇమ్మాన్యుయేల్ సంజన కి ఇస్తే అందుకు మిగిలిన కంటెస్టెంట్స్ అభ్యంతరం చెప్పడంతో సంజన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇమ్మాన్యుయేల్ తన మమ్మీ కోసం వేసుకున్న ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది.
నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి...
నామినేషన్ల నుంచి తప్పించుకోవడానికి వరసగా మరోసారి పాయింట్లు పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ మొదటి స్థానంలోనూ, భరణి రెండో స్థానంలోనూ, మూడో స్థానంలో భరణి, నాలుగో స్థానంలో సుమన్ శెట్టి వచ్చారు. సంజన్ ఈ టాస్క్ కు దూరంగా ఉంది. దీంతో ఎక్కువ పాయింట్లు ఇమ్మాన్యుయేల్ కు వచ్చినట్లు కనపడుతుంది. ఈ టాస్క్ లో నెంబర్ వన్ గా నిలిచిన వారికి నామినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలుండటంతో భరణి, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ గట్టిగా పోరాడుతున్నారు. తనూజ, సంజన, సుమన్ శెట్టి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా టాస్క్ ల్లో గెలిచి మొదటి స్థానంలోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ వారం భరణి చివరి బిగ్ బాస్ కెప్టెన్ గా బిగ్ బాస్ నియమించాడు.


Tags:    

Similar News