Bigg Boss 9 Season : బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేషన్.. ఈరోజు ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు
బిగ్ బాస్ సీజన్ 9 ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు డీమాన్ పవన్ లేదా సంజన లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. డీమాన్ పవన్ ప్రేక్షకుల ఓటింగ్ లో తక్కువగా ఉండటంతో పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సంజనకు కూడా అంతే అవకాశాలున్నాయి. భరణి కూడా కొంత డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తుంది.
అందుకే ఎలిమినేషన్...
సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వడానికి అనేక కారణాలున్నాయి. ఇన్ని రోజులు ఆయన హౌస్ లో కొనసాగడానికి ముఖ్య కారణం మంచోడు, అమాయకత్వం ఉన్న మనిషి, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా కన్నింగ్ ఆలోచనలు లేని మనిషి కాబట్టే ఇన్ని రోజులు హౌస్ లో ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తూ వచ్చారు. గత వారమే ఈయన ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ సడన్ గా ప్లాన్ మార్చి రీతూచౌదరి ని ఎలిమినేట్ చేశారు. ఇది సుమన్ శెట్టి కి కూడా బాగా నెగిటివి అయింది. అందుకే తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఎట్టకేలకు ఆయన నిన్న ఎలిమినేట్ అయ్యాడు.
నేడు డేంజర్ జోన్ లో...
ఆదివారం కూడా డేంజర్ జోన్ లో మరొకరు ఉన్నారు. చివరి వారం కావడంతో ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉంటారు. దీంతో డీమాన్ పవన్, భరణి, సంజన లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇద్దరు లేడీ కంటెస్టెంట్లను హౌస్ లో ఉంచాలనుకుంటే మాత్రం సంజన్ బయటపడుతుంది. పవన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లే. భరణి బాండింగ్ పేరుతోనూ, ఫెయిర్ గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటుడటంతో అతనిని తప్పించే అవకాశాలు దాదాపు తక్కువ అని తెలుస్తోంది. మొత్తం మీద డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఈ వారం సుమన్ శెట్టితో పాటు డీమాన్ పవన్ హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.