Bigg Boss Season 9 : కెప్టెన్ గా కల్యాణ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్స్
బిగ్ బాస్ సీజన్ 9 కెప్టెన్ గా కల్యాణ్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 9 కెప్టెన్ గా కల్యాణ్ అయ్యాడు. మొత్తం ఏడుగురు పోటీ పడగా అందులో చివరకు డీమాన్ పవన్, కల్యాణ్ మాత్రమే మిగిలారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో కల్యాణ్ దే పైచేయి అయింది. ఈ టాస్క్ కు తనూజ సంచాలకులుగా వ్యవహరించింది. అయితే డీమాన్ పవన్ నడుము నొప్పి రావడంతో కొంత ఇబ్బంది పడ్డాడు. లేవలేని స్థితిలోకి వెళ్లిన డీమాన్ పవన్ ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇచ్చిన టాస్క్ ను కల్యాణ్ పూర్తి చేశాడు. బిగ్ బాస్ చివరి కెప్టెన్ గా కల్యాణ్ ఎంపికయినట్లు ప్రకటించారు.
చివరి ఘట్టానికి చేరుకోవడంతో...
బిగ్ బాస్ సీజన్ 9 చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం పన్నెండో వారం నామినేషన్లలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో టాప్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్లంతా డేంజర్ జోన్ లోకి వెళుతున్నారు. నామినేషన్స్ లో ఈ వారం తనూజ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, సంజనా గల్రానీ, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖితలు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే నిన్న రాత్రితో ఓటింగ్ ముగిసిపోయింది. ఇప్పటి వరకూ ప్రేక్షకుల ఓటింగ్ తో పన్నెండు వారాలు నెట్టుకొచ్చిన కంటెస్టెంట్స్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది.
దివ్యను సేవ్ చేస్తారా?
టాస్ లో కల్యాణ్ పడాల, తర్వాత తనూజ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడని తెలిసింది. తర్వాత స్థానంలో భరణి ఉన్నాడు. ఐదో స్థానంలో సంజనా ఉంది. ఆరో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడని, డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఉన్నారని తెలుస్తోంది. అయితే దివ్య కొంత దూకుడుగా ఉండటం ఆమెకు కలసి వస్తుంది. ప్రతి వారం ఎలిమినేషన్ కు దగ్గరగా వచ్చి సేవ్ అవుతుంది. ఈ వారం కూడా దివ్యను సేవ్ చేసి సుమన్ శెట్టిని బయటకు పంపుతారు. అదే డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం దివ్య, సుమన్ శెట్టిలను పంపే ఛాన్స్ లను కొట్టిపారేయలేమంటున్నారు.