Bigg Boss Season 9 : దివ్య ఎలిమినేషన్ ఊహించిందే.. ఆమె సంపాదన ఎంతంటే?
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. అయితే ఇక మూడు వారాలు మాత్రమే ఉండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. కానీ సింగిల్ ఎలిమినేషన్ తోనే బిగ్ బాస్ సరిపెట్టారు. కామనర్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత చివరకు ఈ వారం ఎలిమినేట్ అయింది. దివ్య హౌస్ లో ఉన్నన్నాళ్లు గొడవలు, రచ్చలతో గడిచిపోయింది. భరణితో బ్రదర్ బాండింగ్ తో దివ్య కొంత హైప్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ బాండింగ్ విషయంలో దివ్యకు, తనూజకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.
65 రోజుల పాటు హౌస్ లో...
ఆ గొడవలే దివ్య నిఖిత ఇన్ని రోజులు హౌస్ లో ఉండటానికి కారణాలుగా చెప్పాలి. దివ్య నిఖిత గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రతో గత వారం ఎలిమినేషన్ లేకుండా చేయడంతో దివ్య నిఖిత మరో వారం కొనసాగింది. పన్నెండో వారానికి వచ్చేసరికి దివ్య నిఖిత కొంత సైలెంట్ అయింది. తనూజతో రాజీకి దిగింది. ఇద్దరి మధ్య గొడవలు ముగిసిపోయాయి. మరొకవైపు రీతూ చౌదరి, దివ్య నిఖితకు మాత్రం గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. నామినేషన్ల సమయం నుంచి టాస్క్ ల వరకూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ వారం డేంజర్ జోన్ లో...
ఈ వారం డేంజర్ జోన్ లో దివ్య నిఖిత, సుమన్ శెట్టి ఉన్నారు. కానీ దివ్య నిఖిత చివరకు ఎలిమినేట్ అయ్యారు. కామన్ గా వచ్చి దాదాపు 65 రోజుల పాటు దివ్య హౌస్ లో ఉండటం విశేషం. ఆమెతో పాటు, తర్వాత హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. దివ్య వారానికి లక్ష రూపాయలు సంపాదించింది. అంటే దివ్య నిఖితకు తొమ్మిది వారాలకు గాను పదిహేను లక్షల వరకూ వచ్చినట్లు తెలిసింది. అయితే ఆట మీద కంటే బాండింగ్ పైనే ఎక్కువగా ఆధారపడిన దివ్య నిఖిత ఎలిమినేట్ కావడంతో హౌస్ కొంత బోసిపోయినట్లు కనిపించింది.