Bigg Boss 9 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్... భరణి దెబ్బకు అవుట్
బిగ్ బాస్ 9 సీజన్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
బిగ్ బాస్ 9 సీజన్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకూ మారుతున్న ఓటింగ్ ప్రకారం టాప్ కంటెస్టెంట్ లుగా భావించే వారు టాప్ 5 నుంచి తొలిగిపోయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే వారం వారానికి ఒక్కో కంటెస్ట్ లీడ్ లోకి వస్తుండటంతో ఈసారి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అన్నదానిపై కూడా భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ అనేక మంది పేర్లు వినిపించాయి. టాప్ 5లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఉండే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపించాయి. కానీ ఈ వారం మాత్రం ఆ లెక్కలు మారినట్లు కనిపిస్తుంది.
భరణి దెబ్బకు...
డీమాన్ పవన్ తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే భరణి ఈ రేసులోకి దూసుకు రావడంతో డీమాన్ పవన్ కు దెబ్బతగిలిందంటున్నారు. రెండోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక భరణి ఆట తీరు మారింది. ఆటల్లోనూ, మాటల్లోనూ ఇచ్చి పడేస్తున్నాడు. దివ్యతో వాగ్వాదానికి దిగుతున్నాడు. తనూజతో కూడా టచ్ మీ నాట్ గా ఉన్నాడు. మరొకవైపు బాండింగ్ లకు దూరంగా ఉండటం, జోరు పెంచడంతో భరణి టాప్ 5లోకి దూసుకు వచ్చినట్లే కనపడుతుంది. మరొకవైపు ఆయన పీఆర్ టీం తో పాటు మెగా ఫ్యాన్స్ ఓటింగ్ కూడా భరణికి కలసి వచ్చే అవకాశముందని అంటున్నారు. అందుకే భరణి టాప్ 5లోకి దూసుకు రావడంతో డీమాన్ పవన్ వీక్ అయిపోయాడు.
ఈ వారం డేంజర్ జోన్ లో...
ఇక ఈ వారం డేంజర్ జోన్ లో సంజన, డీమాన్ పవన్, దివ్య నిఖిత ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్నది కూడా బీబీ టీం ఆలోచిస్తుంది. ఇంకా మూడు వారాలే మిగిలి ఉండటంతో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య, సంజన్ లేదా దివ్య డీమాన్ పవన్ ఎలిమినేట్ కావచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండటంతో ఏం జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరే సరికి ఎలిమినేషన్ తో పాటు టాప్ 5 ర్యాంకులు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి.