Bigg Boss Season 9 : బిగ్ ఆఫర్ కాదని.. కప్పుకు మరింత చేరువయ్యారా?
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది.
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన భారీ ఆఫర్ ను తనూజ కాదనుకుంది. అందరి మనసులను గెలుచుకుంది. నిజానికి ఇమ్యూనిటీ పొందడానికి మూడు లక్షల పాయింట్లను ప్రైజ్ మనీ నుంచి కోత పెట్టుకుంటావా? లేక ఎలిమినేషన్ లో ఉంటావా? అని బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ కు తనూజ తనకు ప్రేక్షకుల నుంచి ఇమ్యూనిటీ లభించాలని కోరింది. మూడు లక్షల రూపాయల కోసం కాదని, ప్రేక్షకుల మనసు గెలిచి తాను హౌస్ లో ఉండాలనుకుంటున్నానని చెప్పింది. అంతకు ముందు టిక్కెట్ టు ఫినాలే టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ ను ఓడించి తనూజ టాపర్ గా స్కోరు బోర్డు మీద నిలవడంతో బిగ్ బాస్ ఈ బిగ్ ఆఫర్ ఇచ్చాడు.
ఈ వారమంతా టాస్క్ లే...
బిగ్ బాస్ లో ఈ వారమంతా టాస్క్ లతోనే గడిచిపోయింది. కల్యాణ్ పడాల ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ గా ఎంపిక కావడంతో అతను టాస్క్ లన్నింటికీ దూరంగా ఉన్నాడు. సంచాలకుడిగానే వ్యవహరించాడు. రెండో ఫైనలిస్ట్ గా అవకాశం వచ్చినప్పటికీ తనూజ కాదనుకోవడం ఇప్పుడు ఆమెకు పాజిటివ్ గా మారిందని అంటున్నారు. బిగ్ బాస్ ప్రారంభం నుంచి తనూజ ఒక స్ట్రాటజీతోనే గేమ్ ఆడుతుంది. మరొక వైపు భరణి ఆటతీరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. ఫెయిర్ గా ఆడటాన్ని అందరూ స్వాగతించారు. తనను తనూజ కాదనుకున్నా... తాను లీడర్ బోర్డులో చివర ఉన్న భరణి అవుటయి పోతూ తన పాయింట్స్ ను తనూజకు ఇచ్చేశాడు. ఈ సందర్భంగా భరణి ఏడ్వడం..
భరణి ఎమోషనల్...
తనకు గేమ్ కంటే .. మైండ్ కంటే.. స్ట్రాటజీ కంటే.. హార్ట్ ముఖ్యమని చెప్పారు. నాన్నా.. అని పిలిపించుకున్న వ్యక్తిని అన్యాయం చేయనని హౌస్ మేట్స్ కు చెప్పేసి భరణి మరోసారి హౌస్ లో అందరి మనసులను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ నిర్వహించిన చివరి టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ ఓటమి పాలయ్యాడు. దీంతో అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. తాను ఎప్పుడూ ఓడిపోలేదని, ఫినాలే టాస్క్ లో ఓడిపోయానంటూ రోదించాడు. తనకు కలసి రాలేదని ఇమ్మాన్యుయేల్ వాపోవడం అందరినీ కలచి వేసింది. హౌస్ మేట్స్ అందరూ ఓదార్చినా చాలా వరకూ తేరుకోలేదు. చివరకు తనూజ తాను కూడా టిక్కెట్ ఫినాలే అవసరం లేదని చెప్పి హౌస్ తో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులను కూడా ఈ వారం ఆకట్టుకునేలా చేసింది. విన్నర్ గా తన స్థానాన్ని మరింత దగ్గరకు చేర్చుకుంది.