Bigg Boss 9 : తనూజ గ్రాఫ్ డిజాస్టర్ .. నోరు.. చేతలే ఇలా చేశాయా?

బిగ్ బాస్ 9 సీజన్ లో ఫినాలే టిక్కెట్ రేస్ మొదలయింది.

Update: 2025-12-03 06:36 GMT

బిగ్ బాస్ 9 సీజన్ లో ఫినాలే టిక్కెట్ రేస్ మొదలయింది. ఇందుకోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు టాస్క్ లను పెట్టాడు. మొదటి టాస్క్ లో రీతు చౌదరి అనవసరంగా డెమోన్ పవన్ ను తప్పించి ఆటలో దిగింది ఇమ్మానుయేల్ పవన్ కళ్యాణ్ తో కలిపి రీతు ఒక్క పాయింట్ కూడా తెచ్చుకోకుండా ఓడిపోయింది, కళ్యాణ్ పోటీ ఇచ్చినా కూడా ఇమ్మాన్యూయేల్ చేతిలో ఓడిపోయాడు. ఈ పోటీలో ఇమ్మానుయేల్ సులువుగా గెలిచాడు. రెండో టాస్క్ లో ఇమ్మానుయేల్ సంజన ని ఎంచుకొని బాల్ గేమ్ ఆడాడు. ఇందులో సంజన పోటీ ఇచ్చినా కూడా పొరపాటున తాడు వదిలేయటం తో ఇమ్మానుయేల్ అప్పటికే చాలా బాల్స్ వేసేసి ఉన్నాడు కాబట్టి ఈజీగా గెలిచేశాడు.

సేఫ్ గా ఆడేందుకు...
ఇక మూడవ టాస్క్ లో తనూజ, భరణి, డిమోన్ పవన్ ఆడారు. ఈ టాస్క్ లో తనూజ గెలిచింది. కానీ ఆమె గెలుపు వెనుక చాలా డ్రామా చోటుచేసుకుంది. పైన నుంచిపడే పూలను ఎంచుకొని దూరంగా ఏర్పాటు చేసిన మడ్ పిట్ లో నాటాలి. ఈ టాస్క్ లో తనూజ డిమోన్ పవన్ తో ఒక రేంజ్ లో కొట్లాడింది.ఈ ఆటలో భరణి+తనూజ కలిసి డిమోన్ పవన్ మీద అటాక్ చేసి. అంతే కాకుండా డిమోన్ పవన్ పై తనూజ అనవసరంగా అరిచినట్టుగా కూడా అనిపించింది. ఇక రెండవ టాస్క్ లో ఎవరితో ఆడాలో ఎంచుకోమని బిగ్ బాస్ తనూజ కి చెప్పగా, ఆమె చాలా సేఫ్ గా సుమన్ శెట్టి ని ఎంచుకుంది. ఎందుకంటే అతనితో అయితే చాలా తేలికగా గేమ్ గెలవొచ్చు అనే ప్లాన్ అన్నమాట.
ప్లాన్ బెడిసి కొట్టి...
కానీ ప్రోమో లో చూపిస్తున్నట్లు అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది అని తెలిసింది. ఈ టాస్క్ లో తనూజ ఓడిపోయింది, సుమన్ శెట్టి గెలిచాడు. ఇక్కడ కూడా తనూజ పెద్ద సీన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆమె అరవడం, ఆమె గేమ్ కి చాలా మైనస్ అయ్యేలా అనిపిస్తుంది. గత రెండు వారాల నుండి ఆమె గ్రాఫ్ భారీగా పడిపోతుంది ఆమె ఇప్పుడు మూడో స్థానం లోకి పడిపోయింది. ఇదే తరహా ప్రవర్తన కొనసాగిస్తూ పోతే ఆమెకు నాలుగో స్థానం దక్కడం కూడా అనుమానమే. ఈరోజు ఆమె ఒక టాస్క్ గెలిచినప్పటికీ కూడా, ఆమె నెగిటివ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరుపులు, కేకలు, డామినేషన్ తో తనూజ తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నట్లువుతందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.












Tags:    

Similar News