Bigg Boss Season 9 : బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా?
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ కు వచ్చేసింది. నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి.
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ కు వచ్చేసింది. నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం ఇప్పటి వరకూ తొమ్మిది మంది మిగిలారు. ఇక మూడు వారాలు మాత్రమే మిగిలాయి. సో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గ్యారంటీగా ఉంటుందని అంటున్నారు. నామినేషన్స్ కూడా విభిన్న రీతిలో సాగాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ కు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. అయితే ఈ సందర్భంగా తనూజ, డీమాన్ పవన్ లు మాత్రం ఇమ్మాన్యుయేల్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పి మళ్లీ వాగ్వాదం తర్వాత ఫ్లిప్ అయ్యారు.
హౌస్ నుంచి బయటకు వెళ్లడమే...
ఈ వారం తొలుత ఇమ్మాన్యుయేల్ నామినేషన్ చేశారు. ఇమ్మాన్యుయేల్ రీతూ చౌదరిని తొలుత నామినేట్ చేశాడు. తర్వాత డీమాన్ పవన్ ను నామినేట్ చేశాడు.ఈ సందర్భంగా రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ కు మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. తర్వాత భరణి వచ్చి సంజనను, డీమాన్ పవన్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత రీతూ చౌదరి వచ్చి సంజనను, సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. సుమన్ శెట్టి కూడా రీతూ చౌదరి, డీమాన్ పవన్ ను నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి డీమాన్ పవన్ ను నామినేట్ చేస్తూ ఆరోగ్యం బాగాలేకపోవడంతో నువ్వు హౌస్ నుంచి బయటకు వెళ్లడమే మంచిదని చెప్పడంతో అందరూ నవ్వేశారు. దీంతో తాను సీరియస్ గానే చెబుతున్నానని సుమన్ శెట్టి చెప్పాడు.
వరసగా నామినేషన్లు...
ఇక తనూజ తొలుత ఇమ్మాన్యుయేల్ ను నామినేట్ చేస్తుందని అనుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వ్యవహార శైలిని చాలా సేపు ప్రశ్నించింది. అయితే అందుకు ఇమ్మాన్యుయేల్ తగిన రీతిలో జవాబు ఇవ్వడంతో వెంటనే డీమాన్ పవన్, సంజనను నామినేట్ చేసింది. ఇక సంజన కూడా రీతూ చౌదరి, డీమాన్ పవన్ ను నామినేట్ చేశారు. డీమాన్ పవన్ మాత్రం తనూజను, సంజనను నామినేట్ చేశాడు. దీంతో నామినేషన్స్ లోకి భరణి, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ రాలేదు. కల్యాణ్ కెప్టెన్ గా ఉండటంతో నామినేషన్స్ లోకి రాని వారిని ఒకరిని నామినేట్ చేయమనికల్యాణ్ కు చెప్పడంతో భరణిని నామినేట్ చేశాడు. దీంతో డీమాన్ పవన్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజన, రీతూ చౌదరి, తనూజ, భరణిలు నామినేట్ అయ్యారు.