Bigg Boss 9 : ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం టిక్కెట్ లు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం టిక్కెట్ లు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి. ఈ టాస్క్ ల నుంచి సంజన, డీమాన్ పవన్, తనూజ తప్పుకున్నారు. టాస్క్ లలో ఓడిపోవడంతో ఫస్ట్ ఫినాలే టిక్కెట్ కు వీరు దూరమయ్యారు. మరొకవైపు ఈ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని అంటున్నారు. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. సింగిల్ ఎలిమినేషన్ తో సరిపెడతారా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.
ఎనిమిది మంది హౌస్ లో...
ఇప్పటి వరకూ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ సేఫ్ అయ్యారు. ఇక మిగిలిన ఆరు కంటెస్టెంట్లలో ఎవరూ బయటకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో తనూజ, డీమాన్ పవన్, రీతూ చౌదరి, భరణి, సుమన్ శెట్టి, సంజనలు ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. తనూజ ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉంటుంది. భరణి రీ ఎంట్రీ తర్వాత హౌస్ లో మామూలుగా లేడు. బాండింగ్ లను పక్కన పెట్టి ఆటల్లోనూ, మాటల్లోనూ తన సీరియల్ లోని విలనిజాన్ని చూపుతున్నాడు.
ఈ నలుగురిలోనే...
ఇక మిగిలిన వారిలో డీమాన్ పవన్, రీతూ చౌదరి ఇద్దరు లవ్ ట్రాక్ తో వారిద్దరూ సేఫ్ గా ఉండే అవకాశాలున్నాయి. ఇద్దరినీ విడదీసి ఒకరిని బయటకు పంపితే బిగ్ బాస్ బోసి పోతుందని బీటీ టీం భావిస్తుంది. అందుకే డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజన ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సుమన్ శెట్టి హౌస్ లో ఉండటం అవసరమని భావిస్తే సంజనను తప్పించే అవకాశాలున్నాయి. ఎక్కువగా సంజన మాత్రమే ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు దగ్గరగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. సుమన్ శెట్టి తనూజతో ఆడి గెలవడంతో ఆయనకు కొంత ఓటింగ్ శాతం పెరగడంతో సంజనా డేంజర్ జోన్ లోకి వచ్చినట్లయింది.