Bigg Boss 9 Telugu : రీతూ చౌదరి మరోసారి తొండాట.. పవన్ కోసం?

బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిపై ఒకింత క్లారిటీ వచ్చింది.

Update: 2025-11-12 06:56 GMT

బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిపై ఒకింత క్లారిటీ వచ్చింది. ఎలిమినేషన్ కు దగ్గరలో ఉన్న వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓటింగ్ లో తక్కువగా పడుతుండటంతో పాటు ఈ వారం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి మరోసారి తొండి గేమే ఆడింది. రీతూ చౌదరిని సంచాలకులుగా బిగ్ బాస్ నియమించడంతో డీమాన్ పవన్ కు ఫేవర్ గా ఆమె చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. నిఖిల్, డీ మాన్ పవన్ లు ఇద్దరూ లైన్ దాటడంతో వారిని టాస్క్ నుంచి తప్పించాల్సి ఉన్నా రీతూ చౌదరి మరోసారి తొండి ఆటకు తెరతీసింది. ఇద్దరినీ మళ్లీ టాస్క్ లోకి రప్పించింది. రెండు ఛాన్స్ లు ఇచ్చినట్లు చెప్పింది.

కల్యాణ్ సంచాలకుడిగా...
అయితే కల్యాణ్ మాత్రం సంచాలకుడిగా మంచి గా చేశాడు. బిగ్ బాస్ రాజుగా కల్యాణ్, రాణులుగా రీతూ చౌదరి, దివ్యలను నియమించారు. వారి నుంచి సైన్యాధికారులుగా నలుగురిని, ప్రజలుగా నలుగురిని ఎంపిక చేసుకోమన్నారు. దీంతో వారు డీమాన్ పవన్, తనూజ, సంజన, నిఖిల్ ను సైనికాధికారులుగా నియమించారు. ప్రజలుగా భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, గౌరవ్ లను నియమించారు. అయితే సైనికాధికారుల నుంచి టాస్క్ లో తక్కువ గా పెర్ ఫార్మెన్స్ సాధించాల్సి రావడంతో సంజన తనతో పోటీ పడేందుకు సుమన్ శెట్టిని ఎంచుకున్నారు.
నిఖిల్ స్క్రీన్ స్పేస్...
వీరిద్దరి మధ్య టాస్క్ జరిగింది. సంజన్ బాక్సులను కరెక్ట్ గా పెట్టింది. సుమన్ శెట్టి మాత్రం అడ్డదిడ్డంగా పెట్టడంతో కల్యాణ్ సంజనను సైనికాధికారిగా కంటిన్యూ చేశాడు. దీనిపై తనూజ, దివ్యలు కల్యాణ్ తో వాగ్వాదానికి దిగారు. ఈ వారం నామినేషన్ లో ఇమ్మాన్యుయేల్ తప్ప అందరూ ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా నిఖిల్, గౌరవ్ లీస్ట్ ఓటింగ్ లో కొనసాగుతున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వీరిలో నిఖిల్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండటం, అతి మంచితనంగా ఉండటంతో ఓట్లు తక్కువగా పడే అవకాశముంది. దీంతో ఈ వారం నిఖిల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. మిగిలన వారంతా సేఫ్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.















Tags:    

Similar News