Bigg Boss 9 : దివ్య ఈ మూడు వారాల్లో గేమ్ మార్చేస్తుందా?
బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా ఫ్యామిలీ వీక్ జరిగిపోయింది
బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా ఫ్యామిలీ వీక్ జరిగిపోయింది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయింది. అయితే ఇమ్మాన్యుయేల్ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్ తో ఈ వారం ఎలిమినేసన్ లేకుండా చేయడంతో దివ్య హౌస్ లో ఉండిపోయింది. గత వారం దివ్య, తనూజలకు మధ్య జరిగిన గొడవ మంచి టీఆర్పీ రేటింగ్ తెచ్చిపెట్టడంతోనే ఎలిమినేషన్ లేకుండా దివ్యను కంటిన్యూ చేయడానికే బిగ్ బాస్ టీం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న గోల్డెన్ సేవింగ్ పవర్ ఈ వారం వాడకపోతే అది వృధా అవుతుందని నాగార్జున చెప్పడంతో దానిని ఇమ్యాన్యుయేల్ వాడేశాడు.
సేవింగ్ పవర్ ను...
ఇమ్మాన్యుయేల్ గోల్డెన్ సేవింగ్ పవర్ ను వాడటంలో తప్పులేదు. అయితే దానికి పవర్ ఈ వారంతో ముగుస్తుందని నిబంధన బిగ్ బాస్ పెట్టడం కేవలం దివ్యను హౌస్ లో కొనసాగించడం కోసమేనన్నది అందరి నోట వినిపిస్తున్న మాట. ఈ వారం కూడా టీఆర్పీ రేటు మరింతగా పెంచుకోవాలంటే దివ్య హౌస్ లో ఉంటేనే హాట్ హాట్ గా సాగుతుందని నమ్మి ఈ వీక్ లో ఎలిమినేషన్ లేకుండా చేయగలిగారు. ఇక ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు కూడా వచ్చి వారికి రేటింగ్ ఇచ్చారు. కంటెస్టెంట్లకు రేటింగ్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంది.
దివ్య ఎలిమినేట్ అయినా...
అయితే పాపం దివ్యకు మాత్రం ఎవరూ టాప్ 5లో ఉంచకపోవడం కూడా బిగ్ బాస్ టీం పరిగణనలోకి తీసుకోలేదన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. భరణి తల్లి కూడా తనూజను తన మనవరాలిగా పేర్కొంటూ.. దివ్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లడం, ఏ కంటెస్టెంట్ బంధువులు దివ్యను టాప్ 5 లో ఉంచకపోవడంతో ఆమె పై బయట నెగిటివిటీ ఎక్కువగా ఉందని అర్ధమవుతుంది. అయితే అదే సమయంలో దివ్య ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందని, కొంత వాయిస్ పెంచి మాట్లాడుతున్నందున ఆమె అందరికీ వ్యతిరేక మవుతుందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు జరిగే నామినేషన్ లో దివ్య భరణిని నామినేట్ చేసినట్లు ప్రోమో ద్వారా వెల్లడవుతుంది. దీంతో దివ్య ఆఖరి మూడు వారాల్లో తన ఆటను మార్చినట్లు కనపడుతుంది.