Bigg Boss 9 : ఈ వారం లీస్ట్ ఓటింగ్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భరణి, కూతురు ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. తండ్రి, కూతుళ్ల ఆప్యాయతలకు కళ్లకు కట్టేలా చూపించారు. భరణి కి బయట ఫ్యాన్స్ ఉన్నారా? లేదా? అన్నది పక్కన పెడితే ఈ ఎపిసోడ్ తో ఎక్కువ మంది ఆయనకు అభిమానులుగా మారిపోతారు. ఎందుకంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ భరణి తన ఆరోగ్యాన్నిసయితం పక్కన పెట్టి ఆడుతుండటం అందరినీ కట్టిపడేస్తుంది. ఈ ఫ్యామిలీ వీక్ తో అందరికంటే భరణి ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. భరణి కుమార్తె కూడా తనూజను దగ్గరకు తీసుకుని అక్కా అంటూ మీ ఇద్దరి బాండింగ్ తనకు ఇష్టమని చెప్పడం విశేషం.
దివ్య విషయంలో...
అదే సమయంలో దివ్య విషయంలో కొంత ఆమె అసహనం ప్రకటించింది. ఎక్కువగా డామినేట్ చేయాలని చూడొద్దని, అది చూసి తమకు బాధేస్తుందని దివ్య ముఖం మీదనే చెప్పేసింది. కమాండింగ్ ధోరణని మానుకోవాలని సూచించింది. ఇందుకు దివ్య తన వాయిస్ అంతేనని, భరణి తనకు దేవుడిచ్చిన సోదరుడు అని చెప్పినప్పటికీ ఆమె భరణికి మాత్రం కమాండ్ చేసే వారికి దూరంగా ఉండమని చెప్పడంతో దివ్యతో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి తల్లి కూడా వచ్చి నీ ఆట నువ్వు ఆడు అంటూ... ఇమ్మాన్యుయేల్ తో ఇక్కడకు వచ్చే ముందు నేను ఏం చెప్పాను? నువ్వు ఏం చేస్తున్నావని ప్రశ్నించింది.
లీస్ట్ ఓటింగ్...
ఆఖరుగా ఈరోజు ఇమ్మాన్యుయేల్ తల్లి హౌస్ లోకి రానున్నారు. వచ్చిన వారంతా సంజనపై ప్రశంసలు కురిపిస్తుండటం కూడా విశేషం. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లున్నారు. వీరిలో కల్యాణ్ పడాల, డిమాన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య ఉన్నారు. వీరిలో కల్యాణ్ కు అత్యధికంగా ఓట్లు పడుతున్నాయని, తర్వాత స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడని అంటున్నారు. ఇక భరణి, సంజన కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డేంజర్ జోన్ లో మాత్రం డీమాన్ పవన్, దివ్య ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎక్కువ శాతం దివ్య హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని, లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారన్నది సమాచారం.