Bigg Boss 9 : ఫ్యామిలీ వీక్.. అందరినీ ఏడిపించేశావు కదయ్యా?
బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ అందరినీ అలరిస్తుంది.
బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ అందరినీ అలరిస్తుంది. ఎమోషన్స్ టచ్ తో చూసేవారికి కళ్లనీరు తెప్పిస్తుంది. బిగ్ బాస్ ప్రారంభమై పదకొండు వారాలకు చేరుకోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంటెస్టెంట్స్ తో కలుస్తున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో హౌస్ మేట్స్ వారిని చూడగానే ఎమోషనల్ అవుతున్నారు. బిగ్ బాస్ ఈసారి ఫ్యామిలీ వీక్ లో టాస్క్ పెట్టారు. టాస్క్ లో గెలిచిన వారు ముందుగా అక్కడ ఉన్న టైమ్ బోర్డును తీసుకుంటే వారికి ఆ సమయం కేటాయిస్తారు. తనూజ కెప్టెన్ కావడంతో ఆమెకు ఫ్యామిలీ మెంబర్స్ తో అరవై నిమిషాలు గడిపే సమయం దక్కింది. తర్వాత ఇమ్మాన్యుయేల్ కు నలభై నిమిషాలు, డీమాన్ పవన్ కు ముప్ఫయి నిమిషాలు సమయం దొరికింది.
సమయమిచ్చి...
ఇక కల్యాణ్, దివ్యలకు ఇరవై నిమిషాలు సమయం దొరికింది. మిగిలిన రీతూచౌదరి, భరణి, సుమన్ శెట్టికి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే సమయం దొరికింది. అయితే తనకు దొరికిన ఇరవై నిమిషాల సమయాన్ని కల్యాణ్ సుమన్ శెట్టికి ఇచ్చారు. ముందుగా సుమన్ శెట్టి భార్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరికీ పెళ్లయి పదహారేళ్లు కావడంతో హౌస్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అనంతరం తనూజ కు అవకాశం దక్కింది. అమ్మ అని అను అనగానే.. ఆ చిన్నారి అమ్మా అని పిలిచింది. ఇంతలో తనూజ సిస్టర్ అనూజ హౌస్‌లోకి వచ్చింది. పెళ్లి కూతురు ఇదిగో పెళ్లి కూతురు అని తనూజ సిస్టర్‌ని హౌస్‌కి పరిచయం చేసింది. నువ్వు ఎక్కువ ఏడొద్దు అని చెప్పింది తనూజ సిస్టర్. ఆ తరువాత తన పెళ్లి శుభలేఖని తనూజకి ఇచ్చిందామె. ఆ తరువాత తన చేతులతో పెళ్లి కూతుర్ని చేసింది తనూజ. కాళ్లు మొక్కి ఆశీర్వాదం అందుకుంది తనూజ సిస్టర్.
పెళ్లి కూతురిని చేయడం...
బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి కూతుళ్లని చేయడం ప్రేక్షకులను కొంత ఉద్విగ్నానికి గురి చేసింది. తనూజ సిస్టర్ అనూజ నువ్వు ఏడవద్దని, నువ్వు ఏడుస్తుంటే అమ్మ రెండు రోజులు ఏడుస్తుందని, తాను కంట్రోల్ చేయలేకపోతున్నానని చెప్పింది. అలాగే ఎవరిమీద అరవొద్దని కూడా హింట్ ఇచ్చింది. ఇక సుమన్ శెట్టి భార్య అయితే చాలా బాగా ఆడుతున్నావంటూనే.. తనూజతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆమెకు ఫాలోయింగ్ ఉన్నందున ఆమెతో ఆచితూచి మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయింది. ఈరోజు మిగలిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. డీమాన్ పవన్ తల్లి ఈరోజు హౌస్ లోకి రావడం ప్రోమోలో చూపించడంతో ఈరోజు ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గా సాగనుంది.