Bigg Boss 9 : చివరి వారం కెప్టెన్ ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది

Update: 2025-11-27 06:46 GMT

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది. రెండు రోజుల నుంచి కెప్టెన్సీ కోసం టాస్క్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కెప్టెన్సీ కంటెండెంటర్స్ గా ఎంపికయ్యారు. కల్యాణ్, డీమాన్ పవన్ లు మాత్రమే కెప్టెన్సీ పోటీలో ఉన్నారు. మరొకవైపు భరణి, తనూజ, సుమన్ శెట్టి కెప్టెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ పాత సభ్యులను తిరిగి హౌస్ లోకి తీసుకు వస్తున్నారు. గత సీజన్ లలో టాప్ 5లో నిలిచిన వారితో పోటీలను నిర్వహిస్తున్నారు. పాత సభ్యులే కెప్టెన్సీ రేసులో తమతో పోటీ పడే వారిని ఎంపి చేసుకోవాల్సి ఉంది.

ఇప్పటి వరకూ ఇద్దరు...
అందుకే వరసగా వచ్చిన వారు కొందరు ఓటమి పాలవుతుండగా, ఎక్కువ మంది విజేతలయి కంటెస్టెంట్ రేసు నుంచి తప్పిస్తున్నారు. కల్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపికయ్యాడు. ఇక భరణి గౌతమ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. పాత సభ్యురాలు ప్రేరణ చేతిలో తనూజ ఓటమి పాలయింది. తర్వాత దేత్తడి హారిక వచ్చింది. హారిక సుమన్ శెట్టిని ఓడించింది. తర్వాత మానస హౌస్ లోకి వచ్చాడు. డీమాన్ పవన్ తో పోటీ కి సిద్ధమయ్యాడు. అయితే ఈ పోటీలో మానస్ ఓడిపోయి డీమాన్ పవన్ కంటెంస్టెంట్ రేసులో నిలిచాడు.
పాత సభ్యులతో...
ఈరోజు కూడా కెప్టెన్సీ కోసం టాస్క్ లు జరగనున్నాయి. అయితే ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ రేసులో నిలిచాడన్న వార్తలు వస్తున్నాయి. ఇదే కెప్టెన్సీకి చివరి వారం కావడంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ బాగా పెరిగింది. ఈ నేపథ్యలో చివరి వారం ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య పోటీ ఉంటే ఆట రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. ఇప్పుడు టాప్ 5 లో ఉండేందుకు హౌస్ లో ఉన్న తొమ్మిది మంది సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరు చివరకు మిగులుతారన్నది చూడాలి.


Tags:    

Similar News