Bigg Boss 9 : ఈ వారం నామినేషన్ లో ఏడుగురు.. ఇద్దరిపై వేలాడుతున్న కత్తి

బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే నామినేషన్ల సమయంలో హౌస్ మరింత వేడెక్కుతుంది

Update: 2025-11-04 05:33 GMT

బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే నామినేషన్ల సమయంలో హౌస్ మరింత వేడెక్కుతుంది. పాతుకుపోయిన హౌస్ మేట్స్ ను, కొద్దిగా ప్రేక్షకుల ఆదరణ ఉన్న వారిని బయటకు పంపించేందుకు ఎలిమినేషన్ చేయడానికి నామినేషన్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఈసారి ఎపిసోడ్ లో మాత్రం భరణి, దివ్య, తనూజల మధ్య బంధం పూర్తిగా తెగిపోయింది. ఒకరిని ఒకరు నామినేషన్ వేసుకుని తమ బంధానికి ఎండ్ కార్డు చెప్పేశారు. భరణి, తనూజ నామినేషన్లలో ఈ వారంలో ఉన్నారు. దివ్య కెప్టెన్ కావడంతో నామినేషన్ నుంచి తప్పించుకుంది.

దివ్య మరోసారి...
వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్య భరణితో సోదరుడి బాండ్ ను ఏర్పాటు చేసుకుని టాస్క్ లలోనూ, అన్ని విషయాల్లోనూ ప్రయోజనం పొందాలని చూసింది. అయితే భరణి ఒకసారి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లి తిరిగి రావడంతో ఆమెకు కూడా బంధం ఎలిమినేషన్ కు కారణమని అర్థమయింది. అయితే తనూజను దివ్య నామినేషన్ చేసి మరొకసారి తనకు, భరణికి మధ్య బాండింగ్ చెక్కు చెదరలేదని చెప్పేందుకు ఒక అవకాశమిచ్చినట్లయింది. భరణిపై తనూజ ఫైర్ అయిందన్న ఏకైక కారణంతో బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ తో దివ్య తనూజను నామినేట్ చేసింది.
నామినేషన్ లో వీరు...
ఈ వారంలో మొత్తం ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇందులో రాము, సాయి, తనూజ, కల్యాణ్, భరణి, సుమన్ శెట్టి, సంజన ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. సాయి, భరణి, రాము మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనపడుతున్నారు. సుమన్ శెట్టికి మంచి ఫాలోయింగ్ ఉంది. తనూజకు కూడా ప్రేక్షకాదరణ ఉంది. సంజన, కల్యాణ్ లకు కూడా ఓటింగ్ బాగా పడుతుంది. అందుకని ఈ ముగ్గురిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమని అంటున్నారు. అందులో సాయి, భరణి లు మాత్రమే ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News