Big Boss 9 : నామినేషన్లలో ఎనిమిది మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతడేనా?

బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి ప్రవేశించారు. భరణి, దమ్ము శ్రీజలు తిరిగి హౌస్ లోకి వచ్చారు

Update: 2025-10-29 06:29 GMT

బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి ప్రవేశించారు. భరణి, దమ్ము శ్రీజలు తిరిగి హౌస్ లోకి వచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ ఈ వారం ఎనిమిది మంది వరకూ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎక్కువగా సంజన, గౌరవ్, రాములు డేంజర్ జోన్ లో ఉన్నారని పిస్తుంది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం జరిగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తిరిగి హౌస్ లోకి వచ్చిన గౌరవ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎనిమిదో వారం...
ఎనిమిదో వారం నామినేషన్లలో డిమాన్ పవన్, కల్యాణ్, రీతూ చౌదరి, మాధురి, తనూజ, సంజన, గౌరవ్, రాము నామినేషన్లలో ఉన్నారు. వీరిలో సంజన, రాము, గౌరవ్ లు మాత్రమే డేంజర్ లో ఉంటారంటున్నారు. డీమాన్ పవన్, రీతూ చౌదరి లవ్ ట్రాక్ నడుస్తుండటంతో వారిద్దరినీ బయటకు పంపే అవకాశం లేదు. ఇక కల్యాణ్ కూడా బాగా ఆడుతుండటంతో అతనిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇక తనూజ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నారు. మాధురి గొడవలకు కేరాఫ్ గా ఉండటంతో ఆమెను కూడా తప్పించే ఛాన్స్ లేదు.
సంచాలకుల నిర్ణయమే...
ఈ పరిస్థితుల్లో తెలుగు సరిగా రాని, అలాగే కెమెరాలకు కూడా పెద్దగా కనిపించని గౌరవ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన భరణి, దమ్ము శ్రీజలలో ఒకరిని ఉండాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇందుకోసం గ్రూప్ టాస్క్ నిర్వహించినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. అయితే వీరిద్దరిలో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. టాస్క్ కు సంచాలకులుగా కల్యాణ్, సుమన్ శెట్టి ఉన్నారని ప్రోమోను బట్టి తెలుస్తోంది. అయితే కల్యాణ్ శ్రీజ వైపు, సుమన్ శెట్టి భరణి వైపు నిలిచినట్లు కనిపిస్తుంది. మరి ఎవరు హౌస్ లో కొనసాగుతారన్నది నేటి ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News