Bigg Boss 9 : కొట్టుకోవడం ఒక్కటే మిగిలింది... ఇవేం అరుపుల్రా బాబూ?
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. దివ్య కేవలం పర్సనల్ రైవలీని చూపిస్తుందని పిస్తోంది. గత ఎపిసోడ్ లో గౌరవ్, దివ్య ఇద్దరూ చివరి దశలో నామినేషన్ లో ఉన్న సమయంలో తన వద్ద ఉన్న సేవ్ కార్డును ఉపయోగించకుండా దివ్యను తనూజ రక్షించింది. అయినా దివ్యకు మాత్రం తనూజ పట్ల కసి తగ్గలేదు. ఆమె భరణి విషయంలోనే హర్ట్ అయి తనూజను అవకాశమొచ్చినప్పుడల్లా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందనిపిస్తుంది. తనూజ కెప్టెన్ అయ్యే అవకాశాలు తుంచేయొచ్చు. కానీ దివ్య మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా పర్సనల్ గ్లడ్జ్ తోనే జరిగాయన్నది అందరూ అనుకునేట్లు ఉన్నాయి. పదకొండో వారానికి వారానికి కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ పెట్టి తనూజ, దివ్య మధ్య పెద్ద గొడవే జరిగింది.
గొడవ తీవ్రమై...
తనూజను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలనుకుంది. కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ.. నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి.. వేరే వాళ్లకి ఈ ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలిపింది. దానికి తనూజ నేను గేమ్ ఆడి గెలిచాను. ఎవరు సపోర్ట్ లేకుండా అని అంది. నేను నెక్స్ట్ వీక్ గురించి ఆలోచించి చెప్తున్నాను అంటూ దివ్య చెప్పగా.. లేదు నీ బిహేవియరే అంతా అన్నది తనూజ. నువ్వు బిహేవియర్ తీసుకురాకు తనూజ అంటే.. నేనే కనిపిస్తున్నానా? ఇంకెవరు కనిపించట్లేదా? అంటూ సీరియస్ అయింది తనూజ. నువ్వు అరిస్తే నేను అరుస్తా తనూజ. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా తనూజ అంటూ దివ్య కూడా సీరియస్ అయింది. నేను రీజన్ 100 కరెక్ట్‌గా చెప్పాను అంటే.. చెప్పుకున్నావ్ పో అంటూ తనూజ అన్నది. పో అంటావేంటి? నువ్వు ఎవరు నన్ను పో అని చెప్పడానికి అంటూ మళ్లీ సీరియస్ అయింది దివ్య.
తనూజ స్ట్రాటజీతో...
అయితే తనూజ ఆ తర్వాత తనకు వచ్చిన ఛాన్స్ లో ఇమ్మాన్యుయేల్ ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది. వీరిద్దరి మధ్య చాలా సేపు గొడవ జరిగింది. అలాగే రీతూ చౌదరి, దివ్యా మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే చివరకు బిగ్ బాస్ తనూజకు ఒక పవర్ ఇచ్చారు. ఈ పవర్ ను తనూజ వ్యూహాత్మకంగా ఉపయోగించింది. మెంబర్స్ ను రెండు టీంలుగా విడగొట్టమన్నాడు. దీంతో తనూజ రీతూ, డీమాన్ పవన్, కల్యాణ్, సుమన్ శెట్టి బ్లూ టీంగా, భరణి, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజనలను రెడ్ టీం గా చేసింది. అయితే చివరగా టాస్క్ పెట్టాడు. అయితే ఈ టాస్క్ లో రెడ్ టీం మొత్తం ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో సుమన్ శెట్టి, రీతూ చౌదరిఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం డేంజర్ జోన్ లో దివ్య ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి తెలుస్తోంది. దివ్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.