Bigg Boss 9 : బంధాలు తెగిపోయినట్లేనా.. నామినేషన్లు అలా జరిగినట్లే

బిగ్ బాస్ 9వ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది

Update: 2025-11-25 06:03 GMT

బిగ్ బాస్ 9వ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. నామినేషన్లలో బాండింగ్స్ ను పక్కన పెట్టి మరీ అందరూ కప్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. ఈ వారం రెండు పద్ధతుల్లో నామినేషన్లను బిగ్ బాస్ హౌస్ మేట్స్ ముందుంచాడు. ఒక సీక్రెట్ నామినేషన్. మరొకటి డైరెక్ట్ నామినేషన్. అయితే సీక్రెట్ నామినేషన్స్ లో భరణి తనూజను నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్ డీమాన్ పవన్ ను నామినేట్ చేశాడు. కల్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. తనూజ డీమాన్ పవన్ ను నామినేషన్స్ చేసింది. సంజన తనూజను నామినేట్ చేసింది. దివ్య భరణిని నామినేట్ చేసింది. ఇలా అందరూ తాము నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్పి నామినేషన్స్ ను సీక్రెట్ బాక్స్ లో వేశారు.

డైరెక్ట్ నామినేషన్స్ లో...
అనంతరం డైరెక్ట్ నామినేషన్స్ ను బిగ్ బాస్ పెట్టాడు. ముందుగా భరణని దివ్యను నామినేట్ చేశాడు. వాయిస్ తగ్గించుకుంటే మంచిదని చెప్పాడు. తన గురువు గారు చెప్పిన దాని ప్రకారం కమాండింగ్ తగ్గించుకోవాలని సూచించాడు. అయితే దివ్య దీనికి సమాధానం చెప్పింది. ఎవరో చెప్పినట్లుగా తాను మార్చుకోనని, తాను ఎలా ఉంటానో అలా ఉంటానని చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. భరణిని వేలు పెట్టి చూపడంతో వేలు పెట్టి చూపుతున్నావేంటి? అంటూ భరణి ప్రశ్నించాడు. ఇక ఇమ్మాన్యుయేల్ తనూజను నామినేట్ చేశాడు. తనూజకు, ఇమ్మాన్యుయేల్ కు మద్య వాగ్వాద జరిగింది. తర్వాత సుమన్ శెట్టి కూడా వచ్చి తనూజను నామినేట్ చేశాడు.
రీతూ వర్సెస్ సంజన...
తర్వాత దివ్య తనూజను నామినేట్ చేసింది. గొడవల్లో తనను అనవసరంగా లాగి వ్యాఖ్యలు చేసినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పింది. తర్వాత వచ్చిన తనూజ కూడా దివ్యను నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య గ్యాప్ పోవడానికే ఈ నామినేషన్ చేస్తున్నట్లు చెప్పింది ఇద్దరి మధ్య పెద్దగా వాగ్వాదం జరగలేదు. కానీ కళ్యాణ్.. పవన్ ను నామినేట్ చేశాడు. అయితే ఈ నామినేషన్ లో రీతు చౌదరి మరియు కళ్యాణ్ మధ్య విపరీతమైన గొడవ జరిగింది. రీతూ చౌదరి వచ్చి గొడవ మధ్యలో కల్పించుకుంది. ఇద్దరు ఒకరినొకరు తోసుకునేంత వరకూ వెళ్లింది. తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక అధికారాలు మేరకు కెప్టెన్ రీతూ ఇద్దరిని నామినేట్ చేసింది. కల్యాణ్ ను, సంజనను నామినేట్ చేసింది. అయితే సంజన రీతూ చౌదరి విషయంలో నోరు జారింది. పవన్, రీతూ రాత్రి వేళ కలసి కూర్చుంటారంటూ అనడంతో వివాదం పీక్స్ కు చేరుకుంది. ఇమ్మాన్యుయేల్ కల్పించుకుని అలాంటి మాటలు అనొద్దంటూ సంజనకు చెప్పాడు మొత్తం మీద నామినేషన్లు హాట్ హాట్ గానే సాగాయి.


Tags:    

Similar News