Big Boss 9 Season : తనూజతో పెట్టుకుంటే అంతేనా? దమ్ము శ్రీజ మారలేదా?

బిగ్ బాస్ 9 సీజన్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. దమ్ము శ్రీజ రెండోసారి ఎలిమినేట్ అయింది

Update: 2025-10-31 06:09 GMT

బిగ్ బాస్ 9 సీజన్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. దమ్ము శ్రీజ రెండోసారి ఎలిమినేట్ అయింది. తొలిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు దమ్ము శ్రీజను ఎలిమినేట్ చేశారు. అయితే దమ్ము శ్రీజ తనను ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదని, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వారు మాత్రమే ఎలిమినేట్ చేశారని చెప్పారు. అలాగే భరణి కూడా అంతకు ముందు ఎలిమినేట్ అయ్యారు. భరణి సాఫ్ట్ గా ఉన్నందున, బాండింగ్ ఎక్కువగా పెట్టుకున్నందునే ఎలిమినేట్ చేశారన్న విమర్శలు వినిపించాయి. అందుకోసం బిగ్ బాస్ మరలా ఇద్దరికీ అవకాశం కల్పించారు.

ఇద్దరు రీ ఎంట్రీ ఇచ్చి...
భరణి, దమ్ము శ్రీజలు తిరిగి హౌస్ లోకి ప్రవేశించారు. అయితే ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. ఇందుకోసం టాస్క్ లు కూడా నిర్వహించారు. అయితే ఒక టాస్క్ మాత్రం సంచాలకులు చెరో వైపు ఉండటంతో సంచాలకులుగా మాధురిని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మాధురి శ్రీజ టీం గెలిచినట్లు ప్రకటించారు. అయితే బిగ్ బాస్ ఆ టాస్క్ ను రద్దు చేశారు. తిరిగి మరొక మూడు టాస్క్ లను బిగ్ బాస్ భరణి, శ్రీజలకు పెట్టారు. రెండు టాస్క్ లలో భరణి టీం గెలవగా, ఒక టాస్క్ లోనే శ్రీజ టీం గెలిచింది. తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా ఎవరు హౌస్ లో ఉండాలని ఓటింగ్ కు ఆహ్వానించారు.
టాస్క్ ల్లోనూ.. ఓటింగ్ లోనూ...
కానీ బిగ్ బాస్ నుంచి రెండోసారి దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిందని తెలిసింది. రెండు టాస్క్ లలో ఓటమి పాలు కావడంతో పాటు ప్రేక్షకుల ఓటింగ్ కూడా భరణికి అనుకూలంగా రావడంతో భరణని హౌస్ లో కంటిన్యూ చేస్తూ.. శ్రీజను మరొకసారి ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దమ్ము శ్రీజ రాంగ్ స్ట్రాటజీతో వచ్చింది. రెండోసారి వచ్చినప్పటికీ ప్రేక్షకుల్లో అనుకూలత ఉన్న తనూజను టార్గెట్ చేయడం వల్లనే మరొకసారి ఎలిమినేట్ అయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తనూజను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ, వాయిస్ పెంచి, ఒక్కసారి ఎలిమినేట్ అయిన దమ్ము శ్రీజలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారంటున్నారు. ఈరోజు దీనిపై క్లారిటీ రానుంది.


Tags:    

Similar News