త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ భామ

తన తోటి ఆర్టిస్టులతో కలిసి ఓ వీడియో చేసి తన పెళ్లి గురించి ఆ వీడియోలో తెలిపింది నేహా. నా పెళ్లి గోల మొదలైంది అంటూ ..

Update: 2022-11-21 06:27 GMT

bigg boss neha chowdary

స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నేహా చౌదరి.. ఆ తర్వాత స్పోర్ట్స్ యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నేహా.. ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. హౌస్ లో ఉన్న జంటను చూశాక తనకి కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని.. ఒక వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ తో చెప్పింది. అంతకు ముందు ఎప్పుడు పెళ్లి టాపిక్ తీసినా.. ఇప్పుడే కాదంటూ పక్కన పెట్టేసే నేహా.. ఇప్పుడు నేను ఎస్ చెప్పానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

తన తోటి ఆర్టిస్టులతో కలిసి ఓ వీడియో చేసి తన పెళ్లి గురించి ఆ వీడియోలో తెలిపింది నేహా. నా పెళ్లి గోల మొదలైంది అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అబ్బాయి పేరు అనిల్ అని, ఆరడుగులు ఉంటాడని.. ఇంజనీరింగ్ లో తన క్లాస్ మేట్ అని రివీల్ చేసింది. కానీ.. అనిల్ ఫొటో మాత్రం చూపించలేదు. నేహా అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.


Tags:    

Similar News