Bigg Boss 6 : చంటి అవుట్.. సూర్య-ఇనయ ల మధ్య ఏం జరుగుతుంది ?

వెళ్తూ వెళ్తూ చంటి ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హోస్ట్‌ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో హౌస్‌మేట్స్‌కు..

Update: 2022-10-10 06:41 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. 5 వారాలు పూర్తి చేసుకుంది. ఐదవ వారం ఊహించినట్టే చంటి(వినయ్ మోహన్) ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా.. దేవిశ్రీ ప్రసాద్‌ రూపొందించిన పాన్‌ ఇండియా పాప్‌ సాంగ్ ని బిగ్‌ బాస్‌ షోలో ఆవిష్కరించారు. అనంతరం హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించారు.

ఆ తర్వాత ప్రతివారం లాగానే హౌస్ మేట్స్ ని రెండు టీమ్ లుగా విభజించి.. పలు గేమ్స్ పెట్టారు. ఈ గేమ్ లో విన్ అయిన టీమ్ కి బిగ్ బాస్ కానుకను పంపించారు. ఈ వారం నామినేషన్స్‌ లిస్టులో ఇనయా, చంటి, అర్జున్, మరీనా ఉండగా మొదటి రౌండ్‌లో అర్జున్‌, మరీనా సేఫ్‌ అయ్యారు. చివరగా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది. చంటి లేదా ఇనయ ఎలిమినేట్ అవుతారని తెలియడంతో హౌస్ మేట్స్ అంతా కన్నీరు పెట్టుకున్నారు.
ఇనయ సూర్యను ఓదార్చుతూ.. పలుమార్లు హగ్ చేసుకోవడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అంతకుముందు బిగ్ బాస్ కి తనకు హౌస్ లో ఉన్న క్రష్ సూర్య అని చెప్పడం తెలిసిందే. కానీ సూర్యతో అంత క్లోజ్ గా ఉండటం, మాటిమాటికీ హగ్ చేసుకోవడం హౌస్ మేట్స్ కి కూడా నచ్చడం లేదు. చంటి ఎలిమినేట్‌ అని ప్రకటించగానే ఇనయ కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్లీజ్‌ చంటిగారు, నేనే వెళ్లిపోతానంటూ శోకమందుకుంది.
వెళ్తూ వెళ్తూ చంటి ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హోస్ట్‌ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో హౌస్‌మేట్స్‌కు మార్కులు వేయాలని చెప్పగా, అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు ఫెయిల్‌ మార్కులు వేశాడు. అర్జున్‌ గేమ్‌ ఆడుతున్నాడు, కానీ ఎక్కడో రాజీపడుతున్నాడన్నాడు. ఇక సుదీపకి వంటగదిలోనే టైమ్‌ సరిపోతుందని, గేమ్‌లకు సమయం ఉండటం లేదని, కిచెన్‌ నుంచి బయటకు రావాలని సూచించాడు.
ఇక సూర్య, శ్రీహాన్‌, ఫైమా, మరీనా, రేవంత్‌లకు టాప్‌ మార్కులిచ్చాడు చంటి. ఆర్జే సూర్య అందరినీ ఎక్కువగా ప్రేమిస్తుంటాడని, అది మానేసి ఆట ఆడాలన్నారు. శ్రీహాన్‌ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని, ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పాడు. మరీనా మదర్ ఇండియా అని, ఆమె ప్రాబ్లెమ్‌ రోహిత్‌ అని తెలిపాడు. రేవంత్‌ కి కోపం, ఆవేశం, గారాబం ఎక్కువ అని తెలిపారు. మిగిలిన వారిలో ఇనయకి వందకి వందమార్కులు వేయడం విశేషం. ఆదిరెడ్డి, గీతూలకు 90మార్కులిచ్చాడు. బాలాదిత్య మంచితనం అనే ముసుగులో ఆడుతున్నాడని చెప్పి షాకిచ్చాడు చంటి. ఇక ఈవారం ఎవరెవరు నామినేట్ అవుతారో.. చూడాలి.


Tags:    

Similar News