Bigg Boss 9 : రీతూను నామినేట్ చేసిన డీమాన్ పవన్.. రీజన్ అదేనా?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ లో నామినేషన్ల పర్వం హాట్ హాట్ గా సాగాయి.
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ లో నామినేషన్ల పర్వం హాట్ హాట్ గా సాగాయి. ఫైర్ స్ట్రామ్స్ అంటూ వచ్చిన ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరికంటే ముందు వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన దివ్య మాత్రం హౌస్ లో తన నోటితో లాగించుకుంటూ ఇప్పటి వరకూ వచ్చింది. అయితే ఈ వారం మాత్రం ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనపడుతుంది. సంజనతో పాటు దివ్య ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. నిన్న జరిగిన నామినేషన్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏడుగురు నామినేట్ అయినప్పటికీ తనూజ తన కెప్టెన్సీ పవర్ తో రీతూ చౌదరిని సేవ్ చేయడంతో ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఇద్దరు మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నట్లే కనపడుతుంది.
బిగ్ బాస్ సూచనతో...
తొలుత బిగ్ బాస్ కెప్టెన్ తనూజకు ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలో నువ్వే నిర్ణయించాలని చెప్పాడు. దీంతో తనూజ ఒక్కొక్కరికీ టోకెన్లు ఇస్తూపోయింది. కొందరికి ఇద్దరిని నామినేషన్లు చేసేందుకు, మరికొందరికి ఒకరిని నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చింది. తొలుత ఇమ్మాన్యుయేల్ కు ఛాన్స్ ఇవ్వగా రీతూ చౌదరి, భరణిలను నామినేట్ చేశాడు. గతం కంటే టాస్క్ లలో ఇంకా మెరుగుపడలేదని చెప్పాడు. ఇందుకు భరణి అభ్యంతరం చెప్పాడు. తర్వాత రీతూను కూడా నామినేట్ చేశాడు. తర్వాత డీమాన్ పవన్ ముందు కల్యాణ్ ను తర్వాత రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. దీంతో రీతూ చౌదరి కన్నీటి పర్యంతమయింది. వెక్కి వెక్కి ఏడ్చింది.
నామినేట్ అయిన ఆరుగురు...
కల్యాణ్ తర్వాత తనను నామినేట్ చేసిన డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. ఇక రీతూ చౌదరి దివ్యను నామినేట్ చేసింది.ఈ సందర్భంగా దివ్య, రీతూల మధ్య పెద్దయుద్ధమే జరిగింది. సుమన్ శెట్టి కల్యాణ్ ను నామినేట్ చేశాడు. రీతూ చౌదరి సంజనను నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వారం సంజన, దివ్య, పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే వీరిలో కల్యాణ్, ఇమ్యాన్యుయేలకు ఫ్యాన్ బేస్ ఓట్లు పడతాయి. పవన్, భరణి, సంజనకి కూడా ఈ మధ్యకాలంలో నెగెటివిటీ లేదు కాబట్టి కాస్త సేఫ్ జోన్‌లో ఉన్నారు. గత రెండు వారాలుగా దివ్య ఎక్కువ నెగెటివ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారకపోతే తను వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.సంజన కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లే.