Bigg Boss 9 : రెబల్స్ టాస్క్ నుంచి ఈరోజు తప్పించేదెవరినంటే?
బిగ్ బాస్ టాస్క్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మూడు టీంలుగా విడగొట్టి బిగ్ బాస్ ను మరింత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బిగ్ బాస్ టాస్క్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మూడు టీంలుగా విడగొట్టి బిగ్ బాస్ ను మరింత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పటి వరకూ రెబల్స్ ను బిగ్ బాస్ రంగంలోకి దించాడు. రెబల్స్ కు సీక్రెట్ టాస్క్ లు ఇస్తూ అందులో సక్సెస్ అయితే టాస్క్ నుంచి కంటెస్టెంట్స్ ను తప్పిస్తున్నారు. రెబల్స్ గా దివ్య, సుమన్ శెట్టిని రంగంలోకి దించారు. కూర్చోని ఉన్న ముగ్గురిని వారి సీట్లలో నుంచి లేపి కూర్చోవాలన్న టాస్క్ ను రెబల్స్ విజయవంతంగా ముగించారు. దీంతో కల్యాణ్ ను రెబల్స్ కంటెండర్ పోటీ నుంచి తప్పించారు.
మూడు టీంలుగా...
బ్లూ, పింక్, ఆరెంజ్ టీంలుగా ఉన్న ఈ టీంలలో తనూజ ఆరెంజ్ టీంకు, బ్లూ టీం కు రీతూ చౌదరి, ఆరెంజ్ టీంకు భరణి కెప్టెన్లుగా ఉన్నారు. వీరి గ్రూపులో సభ్యులను ఎంచుకున్నారు. తొలి టాస్క్ లో ఆరెంజ్ టీం గెలిచింది. దీంతో సేఫ్ రిబ్బన్ ను ఇమ్యాన్యుయేల్ కు ఆ టీం ఇచ్చింది. ఇక ఇమ్యాన్యుయేల్ ను రెబల్స్ ఎవరూ ఎలిమినేట్ చేయడానికి వీలులేదు. ఇక రెబల్స్ కు రెండో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కిచెన్ లో ఉన్న పాల ప్యాకెట్లలో ఒకదానిని తాగేసి, మిగిలిన ప్యాకెట్లను స్టోర్ రూమ్ లో దాచి పెడితే రెండో టాస్క్ పూర్తవుతుంది.
టాస్క్ నుంచి...
అయితే రెబల్స్ దివ్య, సుమన్ శెట్టి ఈ టాస్క్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు కనిపిస్తుంది. ఈ టాస్క్ లో గెలవడంతో రెబల్స్ ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే దివ్య, సుమన్ శెట్టి రీతూ చౌదరి లేకపోతే డీమాన్ పవన్ ను టాస్క్ నుంచి తప్పించే ప్రయత్నం చేసే అవకాశముంది. ఇదివరకే కెప్టెన్ అయిన వారిని తప్పించేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తారని సమాచారం. అందుకే డీమాన్ పవన్ ను కానీ, గౌరవ్ ను కానీ టాస్క్ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో ఈ విషయం తేలుతుంది.