Ys Sharmila : పేదల పథకాన్ని నీరు గార్చడమెందుకు?

అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతుంది.

Update: 2026-02-05 07:46 GMT

అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో బహిరంగ సభలో పాల్గొన్నారు. మన్రేగా పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిన పథకమన్నారు. ప్రపంచంలోనే పేదలకు ఉపాధి కల్పించే గొప్ప పథకమని, మన్రేగా కి పుట్టిన ఇల్లు ఆంధ్రప్రదేశ్ అని, ఇదే రాయల సీమ వేదికగా మన్రేగా కు రూపకల్పన జరిగిందని తెలిపారు. రాయలసీమ లో పేద కుటుంబాలకు పెద్ద దిక్కు అయిందని చెప్పారు. పాధి హామీ వల్ల గ్రామాలు అభివృద్ధి జరిగాయన్న షర్మిల పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని...
ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీస్తే కుటుంబాలు దెబ్బతింటాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం లేకుంటే మళ్లీ వలసలు పెరుగుతాయని, ఉపాధి హామీ పథకంపై మోదీ కుట్రలు చేశారని వైఎస్ షర్మిల అన్నారు. ఉపాధి హామీ కింద పెట్టే ఖర్చును వెనుకేసుకోవాలి అని చూస్తున్నారన్నారు. ఉపాధి హామీ కింద 80 వేల కోట్లను వెనకేసుకుని ప్రయత్నం జరుగుతుందని, 80 వేల కోట్లను బిజెపి కాంట్రాక్టర్లకి జేబులు నింపే కుట్ర మొదలయిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయమన్న వైఎస్ షర్మిల మన్రేగా కి గ్రామ్ జి చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.


Tags:    

Similar News