ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్?

మార్కాపురం బస్సు దగ్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2026-03-27 13:02 GMT

మార్కాపురం బస్సు దగ్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని నిగిరిలో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణారెడ్డి బస్సును స్వయంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బస్సు యజమానిని...
మార్కాపురం వద్ద బస్సు దగ్దం అయిన వెంటనే హరికృష్ణారెడ్డి పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే కనిగిరిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మార్కాపురం బస్సు దగ్దం ఘటనలో పథ్నాలుగు మంది మరణించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News