Tirumala : తిరుమలకు శనివారం వెళ్లేవారికి తీపికబురు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2026-03-28 02:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఒకింత ఎక్కువగానే ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి రోజూ ఎక్కువగానే ఉంటుంది. వేసవి తీవ్రత ముదరకముందే తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. గడిచిన కొద్ది వారాలుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

భక్తుల సహకారం అవసరం...
భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నట్తు తెలిపారు. భక్తులు కూడా తిరుమలలోని సిబ్బంది, శ్రీవారి సేవకులతో సహకరించాలని కోరుతుంది. క్యూ లైన్ లలో ఎక్కువ సమయం ఉండకుండా వీలయినంత త్వరగా స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే ఇందుకు భక్తుల నుంచి కూడా టీటీడీకి సహకారం అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి వచ్చిన వారికి మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,526 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,780 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News