YSRCP : వైసీపీది రాంగ్ డెసిషన్? రైట్ వే నేనా?
ysrcp-assembly-boycott-amaravati-capital-resolution
నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం కానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజంతా సమావేశమై రాజధాని అమరావతిపై చర్చించి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిని ఆమోదించి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించనుంది. హైదరాబద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని గుర్తింపును రెండేళ్ల క్రితం ఏపీ కోల్పోయింది. అప్పటి నుంచి చట్టబద్ధమైన గుర్తింపు కోసం ప్రయత్నం జరుగుతోంది. అమరావతి నగర నిర్మాణం కోసం ఎంపిక చేసిన 29 గ్రామాలకు కలిపి ఇంకా ఒక పోస్టల్ పిన్ కోడ్ కూడా రాలేదు.
దూరంగా ఉంటే...
అయితే ఈ ప్రత్యేక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. అమరావతి రాజధాని అమరావతి విషయంలో జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులుగా ప్రకటించారు. రాజధాని అమరావతి పనులను పట్టించుకోలేదు. అమరావతి ఒక వైట్ ఎలిఫెంట్ అని నాడు జగన్ భావించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లింది. జగన్ మూడు రాజధానులంటూ వెళ్లినప్పటికీ 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతినింది. పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయింది.
వచ్చే ఎన్నికల్లో...
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనైనా గెలిచేందుకు జగన్ తన స్టాండ్ మార్చుకునేందుకు ఇది అవకాశమని చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. దీంతో రాజధాని అమరావతిపై తన స్టాండ్ మారలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే అవకాశముంది. దీంతో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో నష్టమా? లాభమా? అన్నది పక్కన పెడితే అసెంబ్లీకి వచ్చి అనుకూలంగా తీర్మానం చేస్తే ఒక తంటా.. లేకుంటే .. మరొక ఇబ్బంది అన్న రీతిలో వైసీపీ పరిస్థితి తయారయింది. మొత్తం మీద ఈ సమావేశాలను ఆసరగా చేసుకుని కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనపైన మరొకసారి విమర్శలు చేసే అవకాశాలున్నాయి.