Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2026-03-27 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి మరిన్ని ఆస్తులను సిట్ గుర్తించింది. ముడుపుల సొత్తుతో తల్లితండ్రుల పేరిట ఆస్తుల కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రూ.70.36 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు రిజిస్ట్రేషన్ విలువ రు 2.85 కోట్లకు చూపించి మిగతాది నగదు రూపంలో చెల్లించినట్లు సీట్ గుర్తించింది.

ఆస్తుల జప్తునకు సిట్
రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు సిట్ చర్యలు ప్రారంభించింది. తల్లి సుభాషినణి పేరిట షాబాద్ లో 17.60 ఎకరాల భూమి, తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరిట జనగామలో ఇళ్లస్థలాలు గుర్తించిన సిట్ అధికారులు ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనుంది. సిట్ దాఖలు చేసే పిటిషన్ కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన విలువైన ఆస్తులు సీజ్ చేశారు. మరిన్ని ఆస్తులు వెలుగులోకి రావడంతో సిట్ జప్తు చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News