Ys Jagan : భూముల పేరుతో చంద్రబాబు వన్నీ స్కామ్ లే
పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కామ్ లేనని వైఎస్ జగన్ అన్నారు
పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కామ్ లేనని వైఎస్ జగన్ అన్నారు. అనేక సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని అన్నారు. పెద్ద సంస్థలకు ఎకరా 99 పైసలకు ఇచ్చే ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములను ఇస్తున్నారని, తన అనుకూలమైన కంపెనీలకు భూములను ఎలాంటి టెండర్లు పిలవకుండానే ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. సత్వా, రహేజా వంటి కంపెనీలకు విశాఖ వంటి ప్రాంతంలో ఖరీదైన భూములను కారు చౌకగా కట్టబెట్టి తాను కమీషన్లను దండుకుంటున్నాడని జగన్ ఆరోపించారు.
అప్పనంగా కట్టబెడుతూ...
తమ హయాంలో తయారీ రంగంలో దక్షిణాదిన నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తాము ఎస్ఎంఎంఈ సెక్టార్ లో 32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ అన్నారు. విశాఖలో 99 రూపాయలకు లూలూ కంపెనీని పథ్నాలుగు ఎకరాల భూమిని చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టాడని జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారని, కప్పం కట్టకుంటే తరిమేస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలని జగన్ అన్నారు. ఈ రెండేళ్లలో మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు.