Weather Report : ఈ జిల్లాల వారు అలెర్ట్ గా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది

Update: 2026-01-09 04:02 GMT

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే చలితీవ్రత కూగా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. చలి మరింత పెరిగే అవకాశముందని, పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచనలు వెలువడుతున్నాయి.

తేలికపాటి నుంచి మోస్తరు వానలు...
ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రానున్న గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుందని, వృద్ధులు, పసి పిల్లలు చిన్నారులు యువత చలికి వణికిపోతున్నారు. బాపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే బయటకు వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయత్రం ఏడు గంటల లోపు మీ పనులను చూసుకొని ఇళ్లకు వెళ్ళండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో చలితీవత్ర, పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
మరింత చలి పెరుగుతుందట...
తెలంగాణలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలలో మరికొన్ని రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇటీవల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ మళ్లీ గత రెండు రోజుల నుంచి తెలంగాణలో చలితీవ్రత మరింత పెరుగుతుంది. శనివారం వరకూ రాష్ట్రంలో పొడి వాతావరణం మాత్రమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అతి తక్కువ ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


Tags:    

Similar News