Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏపీఎస్ ఆర్టీసీలో అద్దెబస్సుల యాజమాన్యం సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అద్దెబస్సుల యాజమాన్యం ప్రకటించింది. స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడంతో తమకు నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని ఆంధ్రప్రదేశ్ అద్దెబస్సుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
అద్దె బస్సుల యాజమాన్యం...
నిన్న రవాణాశాఖ మంత్రి మండింపల్లి రాంప్రసాద్ రెడ్డితో కూడా సమావేశమై తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అద్దె బస్సుల సంఘం అసోసియేషన్ ప్రతినిధులు చర్చించారు. అయితే చర్చలు విఫలం కావడంతో ఈ నెల 12వ తేదీ నుంచి బస్సులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. పండగ సమయంలో అద్దెబస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. ప్రభుత్వం మరోసారి చర్చకు పిలిచే అవకాశముంది