Chandrababu : నేడు తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2026-01-09 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరగనున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం కొత్త పాస్ పుస్తకాలను రైతులకు చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాజముద్రతో కొత్తగా పట్టాదారు పుస్తకాలను రూపొందించిన సంగతి తెలిసిందే.

టీడీపీ కార్యకర్తల సమావేశంలో...
వాటిని రైతులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం రాయవరంలో టీడీపీ కార్యకర్తలతో సమాేవశం కానున్నారు. మండపేట నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలుఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. మధ్యాహ్నం రెండు గంటకు ఈ సమావేశం జరగనుంది. చంద్రబాబు పర్యటన సంరద్భంగా రాయవరంలో తెలుగుదేశం పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News