నేడు కాకినాడ జిల్లాలో పవన్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 26 కోట్ల రూపాయల విలువైన పనులను పవన్ కల్యాణ్ ప్రారంబోత్సవాలు చేయనున్నారని అధికారులు తెలిపారు.
సంక్రాంతి వేడుకల్లో...
అలాగే 186 కోట్ల రూపాయల విలువైన పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేయనున్నారు. రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. పిఠాపురంలో ప్రజలను స్వయంగా కలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. పేదల ఇళ్లను కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు.