తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

Update: 2026-01-09 03:05 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. నిన్నటితో వైకుంఠ ద్వార దర్వనాలు ముగిశాయి. దీంతో ప్రత్యేక దర్శనంతో పాటు ఆర్జిత సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్.ఎస్.డి టోకెన్లను కూడా మంజూరు చేస్తుండటంతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో కొత్త ఏడాది శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీవాణి టిక్కెట్లు ఆన్ లైన్ లో...
నేటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేయనుంది. తిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్ లైన్ విధానాన్ని రద్దు చేసిన టీటీడ ఈరోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది. రోజుకు ఎనిమిది వందల టిక్కెట్ల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.
బయట వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట మూడు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఎన్.జి షెడ్స్ వరకూ భక్తులు క్యూ లైన్ లో నించుని శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయంపడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,580 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,465 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్ల రూపాయలు వచ్చింది.
Tags:    

Similar News