Ys Jagan : రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యల కలకలం

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2026-01-08 11:44 GMT

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని తెలిపారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అన్నారు. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అక్కడ నగరం నిర్మించాలనుకోవడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని జగన్ అన్నారు.

మౌలిక సదుపాయాలు లేని చోట...
అక్కడ నీరు, విద్యుత్తు, రహదారి సౌకర్యం కూడా లేదని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. అమరావతి రాజధానిగా అనువైన ప్రదేశం కాదని వైఎస్ జగన్ అన్నారు. అసలు మౌలిక సదుపాయాలు లేని చోట రాజధాని నిర్మాణం చేయడం సరికాదని తెలిపారు. రివర్ బేసిన్ లో నిర్మాణాలు చేపట్టడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. భవనాలు కట్టుకోవాలన్నా అనుమతి కావాల్సి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్దారు.


Tags:    

Similar News