రాయచోటి అభివృద్ధికి లోకేశ్ భరోసా
మంత్రి నారా లోకేశ్ ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు
మంత్రి నారా లోకేశ్ ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. రానున్న మూడేళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలోమర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
సంపూర్ణ మద్దతు ఉంటుందని...
ముఖ్యంగా విద్య, ఐటీ రంగాల్లో రాయచోటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని, విద్యా సంస్థలు, ఐటీ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.