Andhar Pradesh : ఏపీలో మళ్లీ అమరావతి రాజధాని కలకలం.. జగన్ వర్సెస్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్ గా మారింది

Update: 2026-01-08 11:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్ గా మారింది. రెండో విడత భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోసారి ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. వైఎస్ జగన్ ఈ సమయంలో రాజధాని అమరావతిపై వ్యాఖ్యలు చేయడం కొంత ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది. దీంతో వైఎస్ జగన్ కు మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. . విజయవాడ, గుంటూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని తెలిపారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అన్నారు. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అక్కడ నగరం నిర్మించాలనుకోవడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని జగన్ అన్నారు.

మౌలిక సదుపాయాలు లేని చోట...
అక్కడ నీరు, విద్యుత్తు, రహదారి సౌకర్యం కూడా లేదని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. అమరావతి రాజధానిగా అనువైన ప్రదేశం కాదని వైఎస్ జగన్ అన్నారు. అసలు మౌలిక సదుపాయాలు లేని చోట రాజధాని నిర్మాణం చేయడం సరికాదని తెలిపారు. రివర్ బేసిన్ లో నిర్మాణాలు చేపట్టడం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. భవనాలు కట్టుకోవాలన్నా అనుమతి కావాల్సి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్దారు. అయితే మంత్రి నారాయణ మాట్లాడుతూ జగన్ కు రాజధాని పై అవగాహన లేదని అన్నారు.
రాజధానిపై దాడి అంటూ...
నదీ గర్భంలో నిర్మాణాలు చేపడతామని మంత్రి నారాయణ ప్రశ్నించారు. గతంలో శాసనసభలో అమరావతి లో రాజధాని నిర్మాణంపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి రాజధాని రచ్చ మొదలయింది. రైతుల్లో నెలకొన్న అసంతృప్తి రెండో విడత భూ సమీకరణ నేపథ్యంలో మొదటి సారి చేసిన భూ సమీకరణ చేసిన దాంట్లోనే అభివృద్ధిచేయలేన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమరావతి పనులు వేగం పుంజుకున్న సమయంలో ఓర్చుకోలేక జగన్ ఈ రకమైన దాడికి రాజధానిపై దిగారని మంత్రులు విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద మరోసారి అమరావతి రాజధాని రాజకీయంగా రచ్చగా మారింది.


Tags:    

Similar News