Ys Jagan : తిరుమల ప్రసాదాన్ని కలుషితం చేసింది చంద్రబాబు కాదా?

పక్కా పథకం ప్రకారమే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని వైఎస్ జగన్ అన్నారు.

Update: 2026-02-06 12:48 GMT

పక్కా పథకం ప్రకారమే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని వైఎస్ జగన్ అన్నారు. జోగి రమేష్ ఇంటి ఎదుట మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్రోలు బాంబులు వేసి జోగి రమేష్ ను హత్య చేయాలని పథకం పన్నారన్నారు. జోగి రమేష్ చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేసినంత మాత్రాన దాడులు చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు. మనం నాగరిక సమాజంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్యంలో ఉన్నామా? అని నిలదీశారు. లోకేశ్ చిప్ రిపేర్ కావాలని పూజలు చేయడంలో తప్పేంటని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎవరైతే అధికారులు వీరికి సహకరించారో వారందరీనీ బోనులో నిలబెడతామని తెలిపారు.

చిప్ సరిగా లేకనే...
ప్రతి ఒక్కరూ చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. చిప్ సరిగ్గా ఉంటే ఎవరైనా ఇలాంటివి ఎవరైనా చేయిస్తారా? అని జగన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో గొడ్డుమాంసం, జంతు కొవ్వు లేదని చెప్పినా ఇంకా రాజకీయ స్వలాభం కోసం ఆయన కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్ అదే పనిగా అబద్ధాలను నిజం చేస్తున్నారని జగన్ అన్నారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుకు ఎవరు చెప్పారని జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ దర్యాప్తు చేసిందని, అందులో కొవ్వు లేదని, తమ పార్టీకి చెందిన ఎవరి పేర్లను లేవని తెలిసినా చంద్రబాబు పదే పదే జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఏడుకొండల వాడికి అపచారం చేస్తున్నారని జగన్ దుయ్య బట్టారు.
బాబువి అన్నీ అబద్ధాలే...
చంద్రబాబు వేసిన వన్ మ్యాన్ కమిషన్ చేత అబద్ధాలు నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, చంద్రబాబు ఇంకా ప్రజల్లో చులకన అవుతారని అన్నారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టు అనుకూలంగా రాకపోతే.. అనుకూలంగా నివేదిక కోసం కమిషన్ వేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అనిల్ సింఘాల్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నాడని తెలిపారు. తాము ఆయనను ఈవోగా కొనసాగించామని చెప్పారు.మరి అదే అనిల్ సింఘాల్ ను ఎందుకు తొలగించారని అన్నారు. శ్యామలరావును నియమించిన చంద్రబాబు మళ్లీ ఆయనను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ పాపం జరిగిందని, పాపం చేసిందెవరు? అని జగన్ ప్రశ్నించారు.


Tags:    

Similar News