YSRCP : అమరావతి అవినీతిపైనే మా పోరాటం
అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రాజధానికి ఇప్పటికే చట్టబద్ధత ఉన్నప్పుడు అసెంబ్లీలో మళ్లీ తీర్మానం అవసరం ఏమిటని ప్రశ్నించారు. చట్టబద్ధత గురించి మాట్లాడాలంటే శాసన మండలి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.అమరావతిలో “అవినీతి యజ్ఞం” జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
టెండర్ల వ్యవహారం...
టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకంగా ముద్ర వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.చంద్రబాబు కంటే ముందే జగన్ అమరావతిలో ఇంటిని నిర్మించుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా వైసీపీయే ముందు నిర్మించుకుందన్న విషయన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.