Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో ఎంతసేపు ఉండాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది

Update: 2026-03-27 03:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరస సెలవులు రావడంతో పాటు నేడు శ్రీరామ నవమి కావడంతో పాటు శుక్రవారం అవ్వడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. నేటి నుంచి తిరిగి సోమవారం వరకూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలకు వచ్చేభక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో వారికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

సెలవులు వస్తే చాలు...
పండగ వచ్చినా.. సెలవులు వచ్చినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది. తమ కష్టాలను, సమస్యలను చెప్పుకునేందుకు ఏడుకొండల వాడి వద్దకు ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి అధికసంఖ్యలో తరలి వస్తున్నారు.
కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి శ్రీవారి దర్శనం కోసం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ నిల్చుని ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,292 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News