Breaking : మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
లిక్కర్ స్కామ్ కేసులోవైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు రిలీఫ్ లభించింది. నాలుగు వారాల్లోగా మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ జరపాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ మిధున్ రెడ్డి అరెస్ట్ చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో...
లిక్కర్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును మిధున్ రెడ్డి ఆశ్రయించారు. హైకోర్టు పూర్తిగా విచారణ జరిపేంత వరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు తెలిపింది. మిధున్ రెడ్డి పాత్రపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ మళ్లీ విచారణ జరపాలని తెలిపింది. పార్లమెంటు సభ్యుడి పరువు ప్రతిష్టలను కూడా ప్రాతిపదికగా తీసుకోవాలనిసుప్రీంకోర్టు చెప్పింది.