వైసీపీ పై రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్

వైసీపీ పై ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు

Update: 2026-03-05 06:47 GMT

వైసీపీ పై ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను కట్లు కట్టుకుంటానని వైసీపీ ఆనందపడిందని అన్నారు. అరవై రోజుల్లో పూర్తిగా రికవర్ అవుతానని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతికకార్యక్రమంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.

ఐపీఎస్ సునీల్ పై...
ఐపీఎస్ అధికారి సునీల్ విషయంపై ఏదైనా మాట్లాడితే తనను తనను ఓ వర్గానికి వ్యతిరేకం అని సృష్టిస్తారని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. పది రోజుల్లో కేసు పురోగతి తెలుస్తుందని అన్నారు. తాను వీలయినంత త్వరగా కోలుకుని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతానని, ఎవరూ ఆందోళన, ఆనందపడాల్సిన అవసరం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు.


Tags:    

Similar News