Andhra Pradesh : సైబర్‌క్రైమ్ పోలీసులకు ఏపీ బీజేపీ ఫిర్యాదు
విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది.
విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలను తీసుకోవాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఎక్స్ వేదికగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎక్స్ వేదికగా...
రుద్రరాజు అనే పేరిట ఎక్స్ వేదికగా చేస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదును బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. ఈ పోస్టులు ప్రధాని మోడీ వ్యక్తిగత పరువుకు నష్టం కలిగేలా ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరింది.