Midhun Reddy : నేడు ఏసీబీ కోర్టుకు మిధున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు

Update: 2025-08-01 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న మిధున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా కోర్టు మిధున్ రెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో మిధున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

రిమాండ్ గడువు ముగియడంతో...
రిమాండ్ గడువు ముగియడంతో నేడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గాన మిధున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు అధికారులు తీసుకురానున్నారు. మరొక వైపు నేడు మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News