ఇక పోటీ చేయను.. నిర్ణయం ప్రకటించిన రెండో వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు.

Update: 2022-11-25 05:53 GMT

వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన భోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించిన రెండో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి. ఇటీవల గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వయసు, ఆరోగ్య కారణాలతో...
తనకు 83 సంవత్సరాల వయసు దాటిందని, గుండె జబ్బు కూడా ఉండటంతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను ప్రజల్లో ఎక్కువ సేపు తిరగలేకపోతున్నానని, ప్రజాసమస్యలను తెలుసుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. తాను పోటీ చేయలేనన్న విషయం ముఖ్యమంత్రి జగన్ కు ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది వైసీపీ హైకమాండ్ ఇష్టమని, సర్వే చేయించి గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇస్తామని జగన్ తనతో చెప్పారని చెన్నకేశవరెడ్డి తెలిపారు. తన కుమారుడికి టిక్కెట్ వస్తే అందరూ సహకరించాలని సమావేశంలో కోరారు.


Tags:    

Similar News